దేశం మరియు నాయకుల కొరకు
మన దేశం, వివిధ రాష్ట్రాలు, పరిపాలనా విభాగాలు, రాజకీయ నాయకులు మరియు ఉన్నత స్థాయి అధికారుల బాధ్యతల కొరకు ప్రత్యేక అంశాలు.
ప్రతిరోజూ ప్రార్థించాలనే ఆశ ఉంది, కానీ ఏమి ప్రార్థించాలో తెలియడం లేదా? 40 కేటగిరీలలో 2,000 కి పైగా ప్రార్థనా అంశాలతో — సంవత్సరం పొడుగునా ప్రతిరోజూ మీ ప్రార్థనకు దారి చూపే పుస్తకం.

ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి కష్టానికి, సమస్యకు మనుషుల దగ్గరో, ధనంతోనో పరిష్కారం దొరకదు. దేవుని పాదాల చెంతే మన ప్రతి సమస్యకు అసలైన జవాబు లభిస్తుంది.
ఈ చీకటి లోకంలో వెలుగును ప్రకాశింపజేసే ఏకైక మార్గం దేవునితో మనం కలిగి ఉండే బంధమే. ఆ సంబంధాన్ని మరింత బలపరచుకోవడానికి ప్రార్థనే మనకు ఉన్న గొప్ప భాగ్యం.
ప్రతి విశ్వాసి హృదయంలో రోజూ ప్రార్థించాలనే ఆశ ఉంటుంది. కానీ, సరైన ప్రార్థన అంశాలు దొరకక ఇబ్బందిపడేవారికి మార్గదర్శకంగా నిలిచే అద్భుతమైన పుస్తకమే "ప్రార్థన మార్గదర్శిని".
మీ ప్రార్థన జీవితాన్ని మరింత క్రమబద్ధంగా, ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో సహాయపడుతుంది.
A PRAYER ALMANAC FOR EVERY BELIEVERAn Everyday Prayer Guide
ప్రార్థనాపరుల కోసం దాదాపు 40 విభిన్న కేటగిరీలలో 2,000 కి పైగా ప్రార్థన అంశాలను ఎంతో కూలంకషంగా పొందుపరిచాము.
మన దేశం, వివిధ రాష్ట్రాలు, పరిపాలనా విభాగాలు, రాజకీయ నాయకులు మరియు ఉన్నత స్థాయి అధికారుల బాధ్యతల కొరకు ప్రత్యేక అంశాలు.
వయసుల వారీ సమస్యలు, మానసిక వ్యాధులు, శారీరక దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి స్వస్థత కొరకు ప్రార్థనలు.
దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్న హింసలు, సంఘ కాపరుల ఆత్మీయ, శారీరక అవసరాల కొరకు.
వివిధ మిషనరీ సంస్థలు, క్రైస్తవ కళాశాలలు మరియు గొప్ప దైవజనుల ప్రార్థన అలవాట్లు.
సంవత్సరం పొడుగునా ప్రతిరోజూ 5 నుండి 6 అంశాలతో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ క్రింది సందర్భాలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది:
"ఇద్దరు ముగ్గురు కూడి చేసే ప్రార్థనలకు — ప్రతిరోజూ సిద్ధంగా ఉన్న ప్రార్థనా అంశాలు."
ప్రతి రోజుకు ఒక వాక్యం, దానితో పాటు స్పష్టమైన ప్రార్థనా అంశాలు. Click any page to enlarge.




దయచేసి దానిని పరిశీలించండి; ఈ పుస్తకం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా కొనుగోలు చేయండి.
ఈ కూర్పు నేను చూసిన క్రైస్తవ సాహిత్యమంతటిలో విశిష్టమైనది (Distinctive), విలక్షణమైనది (Unique).
మోజెస్ బెన్నీ ఏర్చి కూర్చిన ప్రార్థన సమాహారము (Prayer Almanac) చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇందులో మన ప్రార్థన పరిధి విపరీతంగా వ్యాకోచిస్తుంది, ప్రార్థన గుడారాల తాళ్ళు పొడవౌతాయి. రకరకాల అనుదిన ధ్యానమాలికలు ఎన్నో ఉన్నాయి గానీ ప్రార్థనాంశాల దర్పణం ఒక్కటి కూడా లేదు. ఆ మాటకొస్తే ఇలాటి ప్రార్థన సంచయం నాకు తెలిసిన ఏ భాషలోనూ లేదు.
ఇందులో వెలయించిన అంశాలను బహు సమగ్రంగా ప్రోది చేశారు సంకలన కర్త. విస్తృత ప్రభావం చూపే అనేకానేక వర్ణనాంశాలు మన ప్రార్థన గడియను పరిపుష్టం చేస్తాయి. జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు; అధికారులు, నాయకులు; బాలకార్మిక వ్యవస్థ; విద్యార్థుల సమస్యలు, వారి మధ్య సేవ; అందరి ఆరోగ్యం; అనాథలు; క్రైస్తవులు ఎదుర్కొంటున్న హింసలు; అన్ని డినామినేషన్ క్రైస్తవులు; దీనమనస్సు మొదలైన క్రైస్తవ సుగుణాలు; ప్రపంచదేశాలు, జనజాతులు; మనుష్యుల్లో సైకలాజికల్ పరిస్థితులు; కృత్రిమ మేధస్సు; మన దేశంలో విద్యాసంస్థలు; అన్నిరకాల వృత్తి నిపుణులు; కేన్సర్, కులం… ఒకటేమిటి మన మనో పరిధిలోకి వచ్చే అన్ని సంగతుల ప్రస్తావన ఇందులో ఉంది.
దానియేలు దైనిక ప్రార్థన జీవితం గురించి మనం చదువుతాము. మనలో చాలామంది ఇలాటి క్రమానుగత ప్రార్థన సరళి పాటించడానికి ఈ పుస్తకమొక గని, మాగాణి. సాధారణంగా మనకు గుర్తుకురాని ప్రార్థన అంశాలు ఇందులో అనుదిన ప్రార్థన అంశాలుగా స్వీకరించి మన ప్రార్థన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు.
మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ ప్రార్థన గుంపు కోసం — మీ తోటి విశ్వాసులకు కూడా బహుమతిగా ఇవ్వండి.